Sunday, February 7, 2010

welcome

స్వాగతం
కీసర గుట్ట పూర్వ విధ్యార్థుల సంగానికి
గత ఇరవై సంవత్శారలుగా మేము కలుస్తూనే ఉన్న (కనీసం మనసులో), ఒక గొప్ప అవకాశం మల్లి మమల్ని కీసర గుట్ట లో కలిపింది. అప్పుడెప్పుడో విడి పడిన దారాలు, ఎక్కడెక్కడికో ఎగిరిపోయిన పతంగులు, మల్లి ఒక దగ్గరికి లాగాపడ్డాయి. ఎవడెంత పొడుగు అయ్యాడో, పొట్టలు ఎలా పెరిగాయో, ఎలా మారమో అని చెక్ చేసుకోవడానికి ఒక పది నిమిషాలు వదిలిపెట్టాము. అంతే ఒక్కసారిగా గతం లోకి Dయివ్ చేసాం. మనం వాడిన మంచాలు, మన మెస్, మనం చిక్కని పాల కోసం బొక్క పెట్టిన మెస్ వెనక డోర్, మన ప్లే గ్రౌండ్, నిజాముద్దీన్ సార్, టీచర్ quarters, టివి చూడడానికి తిప్పలు, మన సతయ్య ఫోజులు, ప్రవీణ్ బౌలింగ్, వంశీ, అశోక్ పాడిన "పిల్లలారా పాటలు.." పది గంటలు సరిపోలేదు.
అంతే కాదు, మనకు ఏడు సంవత్సరాలు అమ్మగా, నాన్నగ, అన్నగా, తమ్మునిగా, అంత తనే అయిన మన స్కూల్ అల్లానే ఉండడం బాద కలిగించింది. అందుకే ఏదైనా చేయాలనుకున్నాం, అది ఒక పదతిగా, ఒక బాధ్యత గా, అందుకే ఈ
అలుమ్ని అసోసియేషన్. మన వాయుసు ని, మన మనసుని మరింత యంగ్ చేయగలిగే ఒకే ఒక సాదనం .

No comments:

Post a Comment