Tuesday, June 25, 2013

మేము, మా స్కూల్ మరియు నిజాముద్దీన్

కీసరగుట్ట లో 83-89 మధ్య చదువుకొన్న ప్రతిఒక్కరికి గుర్తిండిపోయే ఒక పేరు - నిజాముద్దీన్.
అప్పుడు కీసరగుట్ట సిటి కి దూరంగా ఉన్న ఒక గుట్ట ప్రాంత౦. అక్కడ మా స్కూల్, వేద పాటశాల, గుడి తప్ప మరేమీ ఉండేది కాదు. మేము దాదాపు గా నాలుగు జిల్లాల లోని (అంటే వంద కిలో మీటర్ నుండి ఆ పైన) మారు మూలా గ్రామాల నుండి వచ్చిన వాళ్ళమే. వేసవి సెలవల తరువాత వస్తే, మల్లి దసరా సెలవులకే ఇంటికి చేరేది, ఇంట్లో వాళ్ళను చూసేది. ఎంత గొప్ప స్కూల్ అయిన, అన్ని వసతులు ఉన్నా, మంచి టీచర్స్ ఉన్న అప్పుడది మొదట్లో మాకొక జైలు లాగానే కనపడేది.. 
1983 లో డిసంబర్ లో అనుకొంటా., కొత్త పి.ఇ.టి. గా స్కూల్ లో జాయన్ అయ్యారు. అంతకుముందున్న గౌస్ దగ్గర నుండి బాధ్యత తీసుకొన్నాడు. మేము అప్పుడే అయిదవ తరగతి లో చేరి అయిదారు నెలలు అవుతుంది. మాకు గౌస్ గురించి పెద్దగ తెలియదు.
కాని, నిజాముద్దీన్ మా స్కూల్ జీవితం లో చాల పెద్ద పాత్ర పోషించాడు. మొదటి సారి అయన అన్న "attention" అన్న పదం అందరికి గుర్తుంది. ఆ రోజు స్కూల్ అసెంబ్లీ మొత్తం నవ్వింది. కాని కొన్ని రోజుల్లోనే తన ప్రతాపం ఏంటో చూపించాడు.  పొద్దున్న అయిదున్నర కు మొదటి పిఇటి బెల్ మోగేది. రెండో బెల్ పది నిమిషాల వ్యవది లో మోగేది. రెండో బెల్ మోగే సమయానికి అందరు తమ తమ స్థానాల్లో అసెంబ్లీ కావాల్సిందే. నిజాముద్దీన్ తన క్వార్టర్స్ (అప్పుడు మా టిచర్స్ అందరు కుటుంబాలతో సహా అక్కడే ఉన్న క్వార్టర్స్ లో ఉండేవారు) దగ్గరి నుండే మొదటి విజిల్ వుదేవాదు. రెండో విజిల్ అసెంబ్లీ దగ్గర మరో సారి మోగేది. రెండో విజిల్ వినగానే అందరు ఫfreez అయిపోవాల్సిందే. ఎవరైనా తమ స్థానాల్లో లేకున్నా, ఇంకా లైన్ లో నిలబదకున్న వారు ఆ రోజు అయిపోయరే. ఆ దెబ్బలు మాములువి కావు. పొద్దున్నే అంత చలిలో (అది గుట్ట పైన), ఒక బనిన్, నెక్కర్ పైన, ఆ పైన బెత్తం తో దెబ్బలు.. అటు పైన వ్యాయామం మొదలు... అంత పెద్ద గ్రౌండ్ (ఇప్పుడు అది చిన్నగా అనిపిస్తుంది) చుట్టూ పది నుండి ఇరవై రౌండ్స్., మొత్తం మూడు లోకాలు కనిపించేవి. అప్పుడప్పుడు "cross country" అని గుట్ట నుండి కింది వరకు దాదాపు నాలుగు కిలోమీటర్లు పరిగెత్తించే వాడు. పొద్దున్న వ్యాయామాలు అవగానే ఒక గంట సమయం దొరికేది. తొందరగా తయారయి, మల్లి స్కూల్ అసెంబ్లీ కి హజ్రయ్యేవాళ్ళం. అక్కడే అంతే ..చాల strict. ఎవడైనా రాకపోతే యిట్టె తెలిసిపోయేది. ప్రతి క్లాస్ కి ఒక అసెంబ్లీ లీడర్, వాడు ఆరోజు అసెంబ్లీ కి వచ్చిన వారెంతమందో, సిక్ అయిన వారెంతమందో, డుమ్మా కొట్టిన వారెంతమందో ఒక పద్దతి ప్రకారం చెప్పాలి. వాడు తప్పు చెపితే వాడికి పడేవి. వాడు కరెక్ట్ గ చెప్పితే, రానివాడికి పడేవి.
సాయంత్రం గేం పిరియడ్ అలానే ఉండేది. అయిదు వరకల్ల అంత  గ్రౌండ్ లో ఉండాలి. రెండో విజిల్ వినగానే ఎక్కడ ఉన్న వారు అక్కడే "freez" అయిపోవాలి. అంటే అప్పటికి వాడి అసెంబ్లీ స్థానం లో కి రాకపోతే వాడు దొరికిపోయేవాడు. అక్కడ రాకపోయిన దొరికి పోయేవాడు.అప్పుడు దెబ్బలే.. గేమ్స్ పిరియడ్ లో అందరు ఎదో ఒక గేం తప్పని సరిగా ఆడాలి. గేం పిరియడ అయిపోగానే మల్లి రెండు విజిల్ లు. మొదటి విజిల్ కి అందరు "freez" కావలి, రెండో విజిల్ కి రిలక్ష్ అయిపోయి తమ స్థానం వద్దకు వచ్చేయాలి. కాని చాల మంది ఆట మోజులో, అరుస్తునో మొదటి విజిల్ వినక అలాగే అరుస్తూ ఆడుతూ, తిట్టుకుంటూ ఉండేవారు.., freez కాని వారికి మల్లి దెబ్బలు పడేవి..
డిన్నర్ తరువాత నైట్ స్టడీ పిరియడ్.. మాకేమో నిద్ర ఆగేది కాదు. ఎవరో ఒక టిచర్ incharge గా ఉండి, స్కూల్ లోనే కూర్చునేవాడు (తొమ్మిది గంటలకు స్లీపింగ్ బెల్ అయ్యేవరకు). ఎప్పుడైనా ఎవరైనా లేకపోయినా, టీచర్స్ కొంచం పట్టించుకోక పోయిన మా అల్లరి అదిరిపోయేది. అంతే మళ్ళి నిజాముద్దీన్ బెత్తం తో ప్రత్యక్షమయ్యేవాడు. స్కూల్ లో ఉన్న 365 పిల్లల్ని నిలబెట్టి కొట్టేవాడు. ఎన్ని బెత్తాలు ఇరిగేవో తెలియదు.
ఎన్ని సార్లు, ఈ సార్ని తిట్టుకోన్నమో లెక్కలేదు. అలానే ఓ సారి పచ్చి బూతులు తిడుతూ దొరికిన లక్ష్మన్ ని మల్లి వచ్చి కొట్టడం ..ఇలాంటివి ఎన్నో...    
అదొకటే ఆయనను పిల్లలకి దగ్గర చేయలేదు. పొద్దున్న అయిదు నుండి రాత్రి తొమ్మిదిన్నర వరకు అయన పిల్లలతో ఉండేవాడు. ఆయన క్వార్టర్ లోకి హాయిగా వెళ్ళవచ్చు. ఎనిమిది, తొమ్మిది చదువుతున్న పిల్లల్ని మిగితా సమయాల్లో ఒక ఫ్రెండ్ లా చూసుకొనే వాడు. ప్రతి పిల్లవాడి గురించి అతనికి తెలుసు. తరచూ హాస్టల్ లో కి వచ్చే వాడు (మిగితా టీచర్స్ కూడా తరచుగా హస్తాలో లో కి వస్తు ఉండేవారు). ఎవరైనా జ్వరం తో ఉన్న, మరే అనారోగ్యం తో ఉన్న ఒకటికి రెండు సార్లు కనిపెట్టు కొని ఉండే వాడు.
యోగ విద్య మొదటి సారిగా ఆంధ్ర ప్రదేశ్ లో మా స్కూల్ లోనే మొదలు పెట్టారు. అప్పటి ముఖ్య మంత్రి, NTR గారు వస్తారనే ప్రచారం, ఆ విధంగా షెడ్యుల్ కూడా తయారయ్యింది. అయన రాలేక మిగితా మంత్రులను (గాలి ముద్దు క్రిషనమనాయుడు, ఇంద్ర రెడ్డి) రావడం జరిగింది. మరో సారి దగ్గుపాటి స్కూల్ డే కి హాజరయ్యారు.
రిపబ్లిస్ డే పరేడ్ లో మా స్కూల్ పిల్లలతో "విద్య శాక" శకటం పై యోగ మరియు మిగితా విన్యాసాలు చేయించి, NTR తో ప్రశంషాలు పొందారు. జిల్లా స్థాయి లో ఎలాంటి పోటీలు జరిగిన "కీసరగుట్ట" స్కూల్ కే మొత్తం (ఒకటో, రెండో మినహాయించి) ప్రైజ్ లు వచ్చేవి. రాష్త్ర స్థాయి పోటిలలో స్కూల్ పిల్లలకు స్థానం ఉండేది.
 అందుకే ఆయనకు ప్రత్యెక స్థానం ఉండేది. ఎప్పుడు స్టూడెంట్ పక్షాన నిలిచే నిజాముద్దీన్ కి, స్టాఫ్ స్థాయిలో అభిప్రాయ బేధాలు ఉండేవనుకొంటా..ఆయనకు మేమే కాక, మా పేరెంట్స్ కూడ ఫాన్స్ అయిపోయారు.
అలాంటి తను, ట్రాన్సఫర్ వెళ్ళిపోతే ఎలా ఉంటుంది??? మేము పదో తరగతి లో ఉండగా, మేము స్కూల్ విడిచి వేల్తామనగా ఆయనకు ట్రాన్సఫర్ ఆర్డర్స్ వచ్చాయి. అప్పుడు మేము చేసిన హడావుడి అంటా ఇంతా కాదు. పిల్లలమే అయిన అది ఆపడానికి మాకు తోచిన ప్రయత్నాలు మేము చేసాము. ఇదంతా చుసిన ప్రిన్సిపాల్ (అప్పుడే కొత్తగా చేరిన రమణమూర్తి గారు), ట్రాన్సఫర్ ని వాయిదా వేయడానికి ప్రయత్నించి, కొన్ని నెలలు ఆపగలిగాడు.
అయన ఎలాగు వెళ్తాడని తెలిసి. ఇంకా అతనితో ఫోటోలు, గంటలు గంటలు ముచట్లు. అయన మాకు బాగా చదువుకోవాలని మరెన్నో సుద్దులు చెప్పడం..
అయన ట్రాన్సఫర్ అయి వెళ్ళిపోయే రోజు   పెద్ద హంగామా నే చేసాము. ఫేర్ వెల్ పార్టి లో ఒక్కరు మాట్లాడలేక పోయాం.. ఏడవడమే, ఏడవడం. స్కూల్ మొత్తం పెద్దగ ఏడవడం. కొన్ని గంటల పాటు ఏడుస్తూనే ఉండిపోయం.. అప్పుడు రోజుకు నాలుగు  సార్లు మాత్రమె బస్సు కీసరగుట్ట కి బస్సు వచ్చేది. అయన వేల్లలనుకొన్న బస్సు వెళ్ళిపోయింది. మల్లి మరో రెండు గంటల తరవాత వచ్చిన బస్సు ని మేము వెల్లనివ్వలేదు. ఎలాగో, అలాగా మాకు సర్ది చెప్పి ఆ రోజు వీడ్కోలు చెప్పి వెళ్ళాడు. అంతగా మేము మల్లి ఎప్పుడు ఎడవలేదేమో..
....అలంటి నిజాముద్దీన్ ని దాదాపుగా ఇరువైదు సంవస్తరాల తరువాత కలిసాడు.. నిజాముద్దీన్ ఫోనే నంబర్ దొరికిందని తెలియగానే ఉత్సాహం ఆగలేదు..కాని ఎక్కడో చిన్న డౌట్. మనల్ని, మన పేరు ఆయనకు ఇంకా గుర్తు ఉంటుందా అని.. డౌట్ గానే ఫోనే చేసి.., "నమస్తే, నేను వంశీ ని సార" అని చెప్పా.., నిజాముద్దీన్ అంతే హుషారుగా "చెప్పరా ఎక్కడున్నావ్" అన్నాడు. "సార్ నన్ను గుర్తు పట్టరా" అని కొంత అనుమానంగా అడిగాను. "ఒరే ..గుర్తుపట్టక పోవడం ఏంట్రా..పొట్టిగా, సన్నగా ఉండేవాడివి..ఏమైనా లావు అయ్యావా" అని ఎదురు ప్రశ్న వేయడమే కాక, మా క్లాస్ లో కొందరి పేర్లని అడిగి, వారి గురించి వాకబు చేసాడు.. ఆ రోజు భలే సంతోషం వేసింది..
ఇప్పుడు తన దగ్గర మా అందరి ఫోటో లు భద్రంగా ఉన్నాయని తెలిసి చాల ఆశ్చర్యం వేసింది. అప్పుడు పేపర్లో వచ్చిన వార్తలు, మేము చేసిన "పిరమిడ్" లు, యోగ విన్యాసాలు, స్కూల్ డే ఫోటోలు, ఆయనతో మేము పర్సనల్ గ దిగిన ఫోటోలు, మేము రాసిన ఉత్తరాలు అన్ని భద్రంగా ఉన్నాయి..
["మీరు మరిచిపోయిన నేను కీసరగుట్ట ని మరిచిపోనురా..అదే నా జీవితాన్ని మలిచింది"  అంటూ తనో పిల్లాడిలా స్కూల్ గురించి అడుగుతూ ఉంటె , మల్లి పాత జ్ఞాపకాలు మరింత ఉత్సహాన్ని ఇస్తున్నాయి..
కీసరగుట్ట స్కూల్ అప్పటికి ఇప్పటికి చాల మారిపోయింది. దాని యధాస్థితి కి తీసుకురాలేక పోయిన, కొంత లో కొంత మార్చాలి.. అందుకు అయన తన వంతుంగా (ఈ వయసులో కూడా) మమల్ని అందరిని మల్లి కలపడానికి ప్రయత్నిస్తున్నాడు.
అందుకే కీసరగుట్ట పూర్వ విద్యార్తులు ఒక వేదికగా కలుసుకొందాం.. మెయిల్స్ ద్వారానో, ఫోన్స్ ద్వారానో, మరో రాకంగానో ..... (నా నంబర్ -9849565496)]