అప్పుడు అంతే, ౩౦ పైన రోల్ నెంబర్ లో ఉండేవాడు, చాలా కొద్ది మంది కే అందుబాటు లో ఉండేవాడు. అక్కడ కట్ చేస్తే ...
ఒక ౧౫ (పది హేనూ) సవంత్సరాల తరువాత, ఒకరోజు ...
ఎక్కడో ఒక దగ్గర కలుద్దామని వాడి నుంచి ఫోన్. బల్కం పెట్ పార్క్ దగ్గర (బయిటే) కలిసాము. తను రీసెంట్ గా ఒక సినిమా చూశానని, అది చాల బాగుందని, కాని ఎవరు distribute చేయట్లేదని చెప్పుకోచాడు. నేను కొంత డబ్బు పెట్టగలిగితే, మనం Nizam rights కొనవచ్చు అని చెప్పాడు. అప్పటి వరకు ఇంట్రెస్ట్ గా ఇంటున్నావాని, మనీ అనగానే తెల్ల మొహం వేసాను. నన్ను బైక్ పైన కలవడానికి వచ్చిన వాడు, ఒక సినిమా కొనడం గురించి ఎలా ఆలోచించాడో అసలు అర్థం కాలేదు. మరి మిడిసి పడుతున్నడేమొ అనిపించింది. అతి గా ఆలోచించే ఆడావాడు గాని, మగవాడు గాని బాగు పడ్డట్టు చరిత్ర లో లేదు, అన్న రజని డైలాగ్ గుర్తొచ్చింది. మనసు లో నవ్వుకొని, మాట మార్చి బై చెప్పి బైక్ ఎక్కి బయట పడ్డాను. కట్ చేస్తే ....
ఆ సినిమా "ఆనంద్". అప్పుడు మొదటి సారి మన్మోహన్ టేస్ట్ పైన నమ్మకం కలిగింది. ఆ తరువాత కలవడం పెరిగింది. comfortable గా పక్కవాడి సినిమా ల గురించి, వాడు రాసుకొన్న కథ ల గురించి మాట్లాడుకొనే వాళ్ళం. అలా సొల్లు తో జరిగి పోతుండగా, మరో బాంబు పేల్చాడు. సడన్ గా ఫోనే చేసి తానో తమిళ్ సినిమా కొనాలని ప్లాన్చేసానని, కొనడం ఒక్కటే మిగిలిందని చెప్పాడు. అమీర్పేట్ లోని ICICi బ్యాంకు దగ్గర కలవమన్నాడు, ఒక లక్ష సర్దితే సినిమా కొనవచని చెప్పాడు. అది నమ్మకపోవడం నా వివేకం అనుకొన్నాను. కట్ చేస్తే....
రక్షణ అనే టైటిల్ తో శ్రిరాం, స్నేహ ల పాతతమిళ సినిమా, మంచి ప్లాన్ తో buisness చేసి, బంజర హిల్స్ లో ఆఫీసు ఓపెన్ చేసాడు. అక్కడే ఉన్న నిర్మాత మండలి లో చేరిపోయాడు. ఆ తరువాత హనుమాన్ (చిరంజీవి తో దుబ్బింగ్...sorry dubbing), మరి కొన్ని distributions, కొత్త కతలు, కోతలు, ప్లాన్లు, పాట్లు... అలా జరిగిపోతుండగా ...
"ఇలా కాదురా, మనమే ఒక సినిమా, మన దర్శకత్వం తో తీయాలి. ఒక రెండు, కోట్లు ఉంటె చాలు" అన్నాడు. ఈ సరి మాత్రం నా వివేకం సరిగా పని చేస్తున్దనుకొన్నాను. కట్ చేస్తే..
నా వివేకం సరిగానే పని చేసింది. నేను అనుకోనట్టే వాడు సినిమా స్టార్ట్ చేసాడు. ఎందు కంటే, ఒక రోజు ఫోనే చేసి వరంగల్ వస్తున్నాను, locations చూడడానికి అని చెప్పాడు. వచాడు. నమ్మక తప్పలేదు. ఒక రోజు సినిమా పటాలమే వచ్చింది. ఆ రోజే తెలిసింది సినిమా కస్టాలు అంటే ఏంటో. అసలు వీడు సినిమా తీస్తాడా లేదా అనే doubt... cut చేస్తే .....
వాడు విజయం సాదించాడు. కత రాయడం, తన కథను సినిమా చేయడం, దర్శకుడు అవడం వాడి ఆశే అయితే వాడు ఘన విజయం సాదించాడు. గెలుపు ఓటములు ముఖ్యం కాదు, మన కిష్టమైన పోటిలో మనం ఉన్నామా లేదా అన్నదే ముఖ్యం. మనం మనతో చేసే పోటి ముఖ్యం. పక్కవాడి apporval, stamp, appreciation నీకో స్థానం ఇవ్వచు కాని అవి గెలుపు, ఓటమి లానే relative terms. ముగింపు (నీకు కావాల్సింది ఏంటో) తెలిసిన ప్రారంబాలే చరిత్ర సృస్టిస్తాయి.
GK, Chalam పుస్తకాలు చదివి, అర్థం చేసుకొన్నా పైత్యం పైనది. ఇప్పుడు గుర్తొచింది. వాడి విజయం పది మందితో పంచుకోవడానికి, ప్రతి ఒకరికి చూపించే అవకాశం వాడికి వచ్చింది. పోలిస్ ..పోలిస్ త్వరలో విడుదల. అందుకనే వాడికి మన అందరి తరపున ....
బెస్ట్ అఫ్ లక్
0 comments:
Post a Comment